దళిత వివాహితను బంధించి ఒక నెల పాటు లైంగిక దోపిడి - మీడియా సమావేశంలో దళిత నాయకుల ఆరోపణ

By team teluguFirst Published Jan 11, 2023, 7:43 AM IST
Highlights

ఓ దళిత వివాహితను బంధించి ఓ వ్యక్తి నెల రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టాడని దళిత సంఘం నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించారు. బాధిత మహిళ పని చేసే ప్రదేశం నుంచి బలవంతంగా తీసుకెళ్లాడని తెలిపారు. 

ఓ దళిత వివాహితను ఓ వ్యక్తి బంధించి నెల రోజుల పాటు లైంగిక దోపిడికి పాల్పడ్డాడని దళిత సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు బాధిత మహిళతో కలిసి ఆ సంఘం నాయకులు తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో మీడియాతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ దళిత వివాహిత  తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్ లో సానిటేషన్ వర్కర్ గా పని చేస్తోంది. ఆమె చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ. అయితే  ఆ మహిళ పని చేస్తున్న స్కూల్ కు బలిజపల్లికి చెందిన ఓ వ్యక్తి గత సంవత్సరం నవంబర్ 17వ తేదీన చేరుకున్నాడు.

నా మంత్రి పదవి పీకేసి జగన్ మంచే చేశారు : అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

తనతో పాటు రావాలని, బ్యాంకు రుణం అందిస్తానని చెప్పాడు. బలవంతపెట్టాడు. కానీ దీనికి ఆమె నిరాకరించింది. తాను ఎక్కడికి రానని తెలిపింది. దీంతో కోపంతో అతడు మహిళను స్కూల్ ఆవరణలో బెదిరించాడు. భౌతికంగా దాడి చేసి బైక్ పై ఆమెను ఎక్కించుకొని వెళ్లిపోయాడు. 

అమరావతి అసైన్డ్ భూముల కేసు .. హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ , మాజీ మంత్రి నారాయణ కంపెనీల్లో తనిఖీలు

ఓ ప్రాంతానికి తీసుకెని వెళ్లాడు. అక్కడ ఓ రూమ్ లో నిర్బంధించాడు. అక్కడ ఐదు రోజుల పాటు ఆమెను రేప్ చేశాడు. తరువాత పాకాల మండలం దామలచెరువు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు బంధించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. తరువాత బాధిత మహిళను సొంత గ్రామంలో వదిలిపెట్టాడు.

నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. 40 నిమిషాల పాటు చర్చలు.. అందుకోసమేనా..?

ఈ దారుణంపై మనస్థాపానికి గురైన బాధిత మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అనంతరం ఊరి పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 6వ తేదీన తిరుపతి సూపరిండెంటెంట్ ఆఫ్ పోలీస్, అలాగే దిశ పోలీసు స్టేషన్‌ లో కూడా ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడం లేదని దళిత సంఘాల నాయకులు ఈ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇందులో తిరుపతి అంబేడ్కర్‌ బిల్డింగ్ ఛైర్మన్‌ దుగ్గాని జయరాం, దళిత జేఏసీ నాయకుడు కత్తి హరి, ఇతరులు పాల్గొన్నారు. 
 

click me!