టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు..! పురందేశ్వరి పేరిట ఫేక్ లెటర్ వైరల్..  

Google News Follow Us

సారాంశం

Daggubati Purandeswari: టీడీపీ బంద్ కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ఫేక్ వార్తలు రావడంపై  ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.  

Daggubati Purandeswari:స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని సీఐడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో కోర్టు ఆయనను 14 రోజుల రిమాండ్ కు తలించారు. ఇందుకు నిరసనగా నేడు (సెప్టెంబర్ 11) టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ బంద్ కు ఏపీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వార్తపై దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అవి అబద్దపు వార్తలని స్పష్టం చేశారు. టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర రేపటి బంద్ కు బీజేపీ మద్దతు ఇచ్చినట్టుగా..నకిలీ బీజేపీ లెటర్ హెడ్ పై తన సంతకంతో ఒక నకీలి లెటర్ సోషల్ మీడియాలో వైలరవుతోందని వెల్లడించారు. ఈ చర్యకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్  పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

జనసేన మద్దతు 

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టు అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ రాష్ట్ర  బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు జనసేన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్విట్ చేస్తూ.. ‘‘ పత్రిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ.. మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది. రేపు జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవల్సిందిగా కోరుతున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Read more Articles on