
ఏపీ బీజేప కొత్త వర్గాన్ని ప్రకటించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మొత్తం 30 మందితో కమిటీని నియమించినట్లు ఆమె తెలిపారు. ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, తపన చౌదరిలను నియమించారు. అలాగే ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ఎన్ మధుకర్ జీలను నియమించారు. ఉపాధ్యక్షులుగా మాధవ్, విష్ణువర్థన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, శ్రీదేవి , అయ్యాజీ వేమ, కొత్తపల్లి గీత, వాకాటి నారాయణ రెడ్డి, కోడూరు లక్ష్మీ నారాయణ, చందూ సాంబశివరావులను నియమించారు. ఇక పది మందికి సెక్రటరీలుగా అవకాశం కల్పించారు. ఆఫీస్ సెక్రటరీ, హెడ్‌క్వార్టర్ ఇన్‌ఛార్జ్, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్ పదవులను భర్తీ చేశారు పురంధేశ్వరి. 7 మోర్చాలకు కొత్త అధ్యక్షులు, ఏడుగురు అధికార ప్రతినిధులతో పాటు మీడియా, సోషల్ మీడియా విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించారు.