Cyclone Asani: అస‌ని తుఫాను ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో 454 సహాయ శిబిరాల ఏర్పాటు !

Published : May 11, 2022, 04:59 PM IST
Cyclone Asani: అస‌ని తుఫాను ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో 454 సహాయ శిబిరాల ఏర్పాటు !

సారాంశం

Cyclone Asani relief camps: అస‌ని తుఫాను ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో  తుఫాను ప్ర‌భావం అధికంగా ఉండే ఏడు జిల్లాల్లో 454 స‌హాయ శిబిరాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.   

Amaravati: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాను ప్రభావంతో ఏడు జిల్లాల్లో 454 సహాయ శిబిరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.2000 లేదా సహాయ శిబిరాలకు వచ్చే ప్రతి వ్యక్తికి రూ.1000 అందజేయ‌నుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. తుఫాను పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమీక్షించారు.  ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి వారి అవసరాలు తీర్చాలని అన్నారు. సహాయక శిబిరాల్లో నిత్యావసర సరుకులు, డీజిల్ జనరేటర్లను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

"జిల్లాలు విభజించబడ్డాయి మరియు చిన్న ప్రాంతాలను నిర్వహించడం వలన ఈ సంవత్సరం తుఫాను సంబంధిత స‌హాయ‌క చ‌ర్య‌లు మరింత మెరుగ్గా నిర్వహించబడ‌తాయ‌ని" సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఇదిలావుండగా, తుఫాను మచిలీపట్నానికి 40 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, విశాఖపట్నానికి 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇది మరికొద్ది గంటల్లో అంతర్వేది సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.  భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తుఫాను మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నర్సాపూర్, యానాం, కాకినాడ, తుని మరియు విశాఖపట్నం తీరాల వెంబడి ఈశాన్య దిశగా పయనించి, రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉద్భవించే అవకాశం ఉంది.

మే 12 ఉదయం నాటికి ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. సైక్లోనిక్ తుఫాను మచిలీపట్నం వద్ద డాప్లర్ వెదర్ రాడార్ (DWR)  నిరంతర నిఘాలో ఉందని అధికారులు తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన అసని తుఫాను (cyclone asani) కారణంగా ఏపీ కోస్తా తీరం వణుకుతుండ‌గా, తుఫాను ఉప్పాడ సముద్ర తీర ప్రాంత వాసులకు (uppada beach) కాసుల వర్షం కురిపిస్తోంది. సముద్ర తీరంలోని మట్టిలో బంగారం దొరుకుతోందని జనం క్యూ కట్టారు. కెరటాల ఉద్ధృతికి తీర ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లు , దేవాలయాలు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. కట్టడాలు , నిర్మాణ సమయంలో భూమిలో వేసే బంగారపు ముక్కలతో పాటు పూర్వీకులు దాచుకున్న వెండి నాణేలు బయటపడుతున్నాయి. దీని గురించి పెద్దఎత్తున ప్రచారం జరిగింది. 

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బంగారం కోపం ఉప్పాడ బీచ్‌కు చేరుకుంటున్నారు. జోరు గాలి, భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీచ్‌లో బంగారం కోసం వేతుకులాడుతున్నారు. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్‌ సమయాల్లో బయటపడుతూ వుంటాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు, స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు ఉప్పాడ తీరంలోనే తిష్టవేశారు. గతేడాది నవంబర్‌లో కూడా ఇలాగే బంగారం కోసం జనాలు గాలించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడికి జనాలు పరుగులు తీస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్