అసాని తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడ రోడ్డులో అలల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండు కి.మీ దూరంలో రోడ్డును బ్లాక్ చేశారు.
కాకినాడ: Asani తుఫాన్ ప్రభావంతో Andhra Pradesh రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అసాని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ అలెర్ట్ చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. Kakinad ఉప్పాడ రోడ్డులో అలల తాకిడి పెరిగే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని రెండు కిలోమీటర్ల రోడ్డును అధికారులు బ్లాక్ చేశారు.2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కాకినాడ పరిసర ప్రాంతాల్లో సిద్దంగా ఉంచారు.
అసానీ తుఫాన్ అనూహ్యాంగా దిశను మార్చుకుంది. తీవ్ర తుఫాన్ తుఫాన్ గా బలహీనపడింది. మచిలీపట్టణానికి ఆగ్నేయంగా 50 కి.మీ. నర్సాపురానికి 30 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దిశ మార్చుకుంటున్న అసాని తుఫాన్ నర్సాపురం తీరానికి దిగువ అల్లవరానికి సమీపంలో భూభాగానికి వచ్చే అవకాశం ఉంది. గంటకు 6 కి.మీ. వేగంతో తుఫాన్ ప్రయాాణం చేస్తుంది. ఇవాళ సాయంత్రానికి Yanam వద్ద తిరిగి సముద్రంలోకి తుఫాన్ ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
undefined
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆరు మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 30 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
అసాని తుఫాన్ పై ఏపీ సీఎం YS Jagan ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు..రాష్ట్ర వ్యాప్తంగా 454 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కరికి రూ. 1000, కుటుంబానికి రెండు వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించారు.
బాపట్ల జిల్లాలో 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 12 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 68 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 780 ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 గ్రామాల ప్రజలు అలెర్ట్ లో ఉన్నారు. 7600 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. 10 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో 32 గర్ణిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.2400 ఎకరాల వరి పంట దెబ్బతింది. అయితే తుఫాన్ ప్రభావంతో 90 వేల లీటర్ల పాలను అంగన్ వాడీ కేంద్రాల్లో సిద్దంగా ఉంచారు.