Visakhapatnam: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం

By Sumanth KanukulaFirst Published Dec 8, 2021, 8:30 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని (visakhapatnam) తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై (Telugu Talli flyover) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 
 

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని (visakhapatnam) తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై (Telugu Talli flyover) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢీవైడర్‌ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో.. యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతులను జయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ (22), మురళీనగర్ మురళినగర్ ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న యువతి(17)గా గుర్తించారు. వివరాలు.. ప్రశాంత్ యువతితో కలిసి బైక్‌పై  మంగళవారం సాయంత్రం ఆశీల్ మెట్ట నుండి కంచరపాలెం వైపు వెళ్తున్నారు. 

అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై వెళ్తున్న సమయంలో వీరి బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంద్దరు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో యువతి కూడా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన ప్రశాంత్, యువతి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. 

ఇక, ప్రశాంత్ సీతమ్మధారలోని ఫ్యాషన్ వైబ్స్ లో సెలూన్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. యువతి నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

పర్యాటకుల వ్యాన్ బోల్తా..
పర్యాటకులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. వివరాలు.. విజయనగరం ప్రాంతానికి చెందిన 12 మంది పర్యాటకులు వ్యాన్‌లో మన్యం అందాలను తిలకించేందుకు వచ్చారు. వారు అరకులోయ, బొర్రాగుహల సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా వ్యాన్‌ బోల్తా పడింది. ఘాట్‌ రోడ్డులోని ములుపు వద్ద వ్యాన్ అదుపుతప్పి కొండచరియను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్నవారందరికి గాయాలు అయ్యాయి.  క్షతగాత్రులను 108 వాహనంలో శృంగవరపు‌కోట ఆస్పత్రికి తరలించారు. 

click me!