
రాష్ట్రంలో సిపిఎం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలో తుని సమీపంలో దివీస్ ఫ్యాక్టరీ ఏర్పటుకు వ్యతిరేకంగా సిపిఎం జరుపుతున్న ఉద్యమం ఈ రోజు పెద్ద అలజడి సృష్టించింది. సిపిఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అనేక మంది గాయపడ్డారు. చాలా మంది స్పృ హ తప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధుతో పాటు సుమారు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిషేధాజ్జలకు వ్యతిరేకంగా సిపిఎం కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.ః
ఈ పరిశ్రమ వల్ల తమకు జీవనో పాధి పోతుందని పరిసర గ్రామాలప్రజలు దివీస్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. అయితే, పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివీస్ కు అండగా ఉంది. సిపిఎం రైతుల పక్షాన నిలబడి ఉద్యమానికి పిలుపునిచ్చింది.
ఇది ఈ ప్రాంతంలోసిపిఎం చేస్తున్న రెండవ పెద్ద ఉద్యమం. పశ్చిమ గోదావరి జిల్లా తొందుర్రులో గోదావరి అక్వా ప్రాసెసింగ్ ప్లాంటు స్థాపనకు వ్యతిరేకంగా కూడా సిపిఎం ఒక ఎడాది కాలంగా ఉద్యమిస్తున్నది. ఈ ప్లాంటు పని ప్రారంభిస్తే పరిసరాలలో జనవరులు, కాలువలు కలుషితమయి తమకు జీవనోపాధి పోతుందని రైతులు, ముఖ్యంగా మత్స్య కారులు ఆందోళన దిగారు.సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ రైతులకు మద్దతు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటయిన అసెంబ్లీలో ఒక్కసీటుకూడా లేకపోవడం సిపిఎం ను బాగా బాధిస్తున్నట్లుంది. 2004లో కాంగ్రెస్ తో కలసి చంద్రబాబు నాయుడి మీద కరెంటు పోరాటం చేసిన తర్వాత ఈ పార్టీకి రాజ్యసభ సభలో ఒకసీటు ఉండింది. ఇప్పటి పార్టీ కార్యదర్శి పి. మధు అపుడే కాంగ్రెస్ సహకారంతో ఎంపి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంటులో కాకపోయినా అసెంబ్లీలో నయినా ప్రవేశించేందుకు సిపిఎం, సిపిఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. మధు అంధ్ర ప్రదేశ్ కార్యదర్శిగా నియమితులయినప్పటినుంచి నిరంతరం పర్యటనల్లో, ఉద్యమాల్లోనే గడుపుతున్నారు. సిపిఎం జనాన్ని అకట్టుకుంటున్నట్లేనా?