
ఏపీలో వైసీపీ (ysrcp) ప్రభుత్వ పాలన, మంత్రులకు అధికారాలు, పెత్తనం చెలాయిస్తున్న వారెవరన్న విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (cpi rama krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని 26 జిల్లాల్లో కేవలం ఐదుగురు రెడ్లు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెత్తనం చెలాయిస్తున్న రెడ్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) పైన ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి (vijaysai reddy) , సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy), వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy rama chandra reddy) లంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఐదుగురు రెడ్లే రాష్ట్రంలోని 26 జిల్లాలను పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏపీలోని ఏ ఒక్క మంత్రికి కూడా అధికారారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు ధర్మానతో పాటు బొత్స సత్యనారాయణ కూడా డమ్మీనేనని రామకృష్ణ పేర్కొన్నారు. హోం మంత్రిగా ఉన్న మహిళా నేతకు కనీసం ఎస్సైని బదిలీ చేసే అధికారం కూడా లేదని రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.