మీరు, మీ నాన్న కూడా పాదయాత్రలు చేసి సీఎం పదవి చేపట్టారు: జగన్ పై సీపీఐ నారాయణ

By narsimha lode  |  First Published Sep 12, 2022, 11:02 AM IST

మీరు, మీ నాన్న కూడా పాదయాత్రలు చేసి సీఎం అయ్యారని  ఏపీ సీఎం జగన్ నుద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు. ర్యాలీలు, పాదయాత్రలంటే జగన్ కు ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. 


అమరావతి: పాదయాత్రలు, ర్యాలీలంటే ఏపీ సీఎం జగన్ కు ఎందుకంత కోపమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రశ్నించారు. సోమవారం నాడు సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతే ఏపీకి  రాష్ట్ర రాజధాని అనే విషయానికి జగన్ ఒప్పుకున్నారని నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సీఎం అయ్యాక జగన్ గుణం మారిందని ఆయన విమర్శించారు. సీఎం పదవి నుండి దిగిపోవాలని అమరావతి రైతులు పాదయాత్ర చేయడం లేదని  నారాయణ చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు పాదయాత్ర చేస్తున్నారని నారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీరు, మీ నాన్న కూడ పాదయాత్రలు చేసిన తర్వాతే సీఎం పదవిని చేపట్టారని నారాయణ గుర్తు చేశారు.

Latest Videos

undefined

also read:అమరావతి నుండి అరసవెల్లి:ప్రారంభమైన రైతుల మహ పాదయాత్ర

అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి అరసవెల్లి  వరకు అమరావతి రైతుల పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని  అమరావతి రైతులు చేపట్టినఆందోళనలు వెయ్యి రోజులు పూర్తైన నేపథ్యంలో అమరావతి రైతులు  పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. గత మాసంలోనే ఈ పాదయాత్రకు అనుమతి కోరుతూ రైతులు  పోలీసులను కోరారు. కానీ ఈ పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతులు.ఈ నెల 9వ తేదీన ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 

సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.  ఈ పాదయాత్రలో సుమారు 600 మంది రైతులు పాల్గొంటారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని అరసవెల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. 

click me!