
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఆభయంతోనే పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు.
నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ తో కలుస్తాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జనసేనతో కలిసి వామపక్షాలు పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తాము వామపక్ష పార్టీలతోనే కలిసి పనిచేస్తామని చెప్పడంతో వామపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.