టీడీపీలోకి కొండ్రు మురళి.. ముహుర్తం ఖరారు

Published : Aug 27, 2018, 01:08 PM ISTUpdated : Sep 09, 2018, 11:43 AM IST
టీడీపీలోకి కొండ్రు మురళి.. ముహుర్తం ఖరారు

సారాంశం

టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు కార్యకర్తల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అనుచరులతో పెద్ద ఎత్తున అమరావతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

కాంగ్రెస్ నేత కొండ్రు మురళీ టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 31వ తేదీన ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు కొండ్రు మురళి అధికారికంగా ప్రకటించారు.

టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు కార్యకర్తల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అనుచరులతో పెద్ద ఎత్తున అమరావతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా...శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గం టీడీపీ నేతలు ఏకతాటిపై లేరు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రతిభా భారతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరుసగా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబుకూ ఫిర్యాదు చేశారు. 

ఏపీ టీడీపీ అధ్యక్షునిగా ఉన్న కళా వెంకటరావు వర్గంతో ఆమెకు సరిపడటం లేదు. వారిపై ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ప్రతిభా భారతి కాకుండా..మరో ఇద్దరు డాక్టర్లు రాజాంలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కొండ్రు మురళీ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అనుచరులతోనే కాకుండా.. టీడీపీ నేతలతో కూడా ... కొండ్రు వరుసగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు మండలాల టీడీపీ నేతలతో మాట్లాడారు. ఒకరిద్దరు నాయకులు తప్ప అందరూ సుముఖత వ్యక్తం చేశారని కొండ్రు అనుచరులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు