కరోనా ఆవిష్కరణ: వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కి జాతీయ స్థాయిలో గుర్తింపు

By Sreeharsha Gopagani  |  First Published Jul 18, 2020, 4:11 PM IST

నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహించిన నూతన ఆవిష్కరణ పోటీల్లో పద్మావతి రూపొందించిన ఒక ప్రత్యేక క్యాబిన్ కు ఈ విశిష్ట గుర్తింపు దక్కింది.


వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. చదువుకున్న చదువును ఈ కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలను కాపాడే ఒక నూతన ఆవిష్కరణ చేసి భళా అనిపించింది. 

నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహించిన నూతన ఆవిష్కరణ పోటీల్లో పద్మావతి రూపొందించిన ఒక ప్రత్యేక క్యాబిన్ కు ఈ విశిష్ట గుర్తింపు దక్కింది. ఈ క్యాబిన్లో ఉండే డాక్టర్లకు కరోనా సోకే అవకాశమే లేకుండా పద్మావతి దీన్ని రూపొందించింది. 

Latest Videos

undefined

ఈ క్యాబిన్ లోకి ప్రవేశించిన తరువాత డాక్టర్లకు పిపిఈ కిట్ ను ధరించాల్సిన అవసరం లేదు. వారు ఇందులో ఉండే రోగులకు చికిత్స చేయొచ్చు. అంతే కాకుండా దేన్ని ధరించి వార్డులు కూడా తిరగొచ్చు. 

పిపిఈ కిట్ కూడా ఇదే పని చేస్తుంది కదా అని అనిపించొచ్చు. ఒక్కసారి వాడిన తరువాత పిపిఈ కిట్ పనికిరాదు. కానీ ఈ కేబిన్ లో నుంచి డాక్టర్ బయటకు వెళ్లిన తరువాత దానంతట అదే శానిటైజ్ అయిపోతుంది. ఇది ఇందులోని ప్రత్యేకత. 

అనంతపురం లోని ఎస్ఆర్ఐటి కాలేజీ వారు పద్మావతి ఆధ్వర్యంలో ఈ క్యాబిన్ ను రూపొందించడం జరిగింది. వేలాది దరఖాస్తులు రాగ అందులోంచి 16 దరఖాస్తులు మాత్రమే విజయం సాధించాయి.ఎమ్మెల్యే ఇక్కడ ప్రజాసేవలో నిమగ్నమయి ఉండి ఈ ఆవిష్కారణ చేయడం నిజంగా గొప్ప విషయం. 

click me!