కరోనా పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై.... ఏపీ హైకోర్టులో పిల్

By Arun Kumar PFirst Published Sep 7, 2020, 12:49 PM IST
Highlights

కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయి ఒళ్లు గుల్లవుతుంటే వైద్యం ముసుగులో ప్రయివేట్ ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని గుల్లచేస్తున్నాయి. 

అమరావతి: కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయి ఒళ్లు గుల్లవుతుంటే వైద్యం ముసుగులో ప్రయివేట్ ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని గుల్లచేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ అయితే ఫీజు కట్టేంతవరకు మృతదేహాలను అప్పగించకపోవడం వంటివి కూడా చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో కరోనా బాధితుల నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రమంగా వసూలుచేస్తున్న ఈ అధిక ఫీజుల దోపిడీపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలయ్యింది. 

మెడిసిన్స్ అధిక ధరలకు విక్రయించడం,ప్రభుత్వ ఆదేశాలను ప్రయివేట్ ఆసుపత్రులు భేఖాతర్ చేస్తున్నాయంటూ పిల్ దాఖలయ్యింది. కరోనాతో చనిపోయిన వారికి 7 నుండి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని పేర్కొంటూ  న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిల్ లో ను దాఖలుచేశారు. 

read more   14రోజుల నా మనవరాలితో సహా... కుటుంబంలో 11మందికి కరోనా: సీఎంకు టిడిపి ఎమ్మెల్సీ లేఖ

ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,794 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరుకొన్నాయి.గత 24 గంటల్లో 68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,417కి చేరుకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 99,689 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకొన్న వారి సంఖ్య రాష్ట్రంలో 3,94,019కి చేరుకొంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 753, చిత్తూరులో 927,తూర్పుగోదావరిలో 1244,గుంటూరులో703, కడపలో904,కృష్ణాలో457,కర్నూల్ లో380, నెల్లూరులో 1299, ప్రకాశంలో 1042, శ్రీకాకుళంలో 818, విశాఖపట్టణంలో 573, విజయనగరంలో 593, పశ్చిమగోదావరిలో 1101 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో చిత్తూరులో 9 మంది, అనంతపురం, గుంటూరులలో 8 మంది మరణించారు.. కడపలో ఏడుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలలో ఐదుగురు, కృష్ణ, కర్నూల్, నెల్లూరులలో నలుగురి చొప్పున మరణించారు. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.

click me!