టిడిపి ఎంపి కొడుకు మీద చంద్రబాబు ఆగ్రహం

Published : Apr 24, 2017, 08:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
టిడిపి  ఎంపి  కొడుకు మీద చంద్రబాబు  ఆగ్రహం

సారాంశం

టోల్ గేట్ రుసుం కట్టమంటే కర్నాటకలోని బాగేపల్లి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన  నిమ్మల అంబరీష్

 

హిందూపురం తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు అంబరీష్ దౌర్జన్య కాండ మీద  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌గేట్ సిబ్బందిపై  అనుచరులతో కలిసి అంబరీష్ దాడి  చేసి వీరంగం సృష్టించారు. 


టోల్ గేట్ కట్టమన్నందుకు ఎంపి కుమారుడికి కోపమెచ్చింది. వాగ్వాదానికి దిగాడు.అంతేకాదు, అనుచరులను పిలిపించుకుని టోల్ రూమ్ అద్దాలను పగులగొట్టి, కంపూటర్లను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు.  సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. 


ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి  ఆగ్రహం వ్యక్తం చేశారు.


టోల్ గేట్ దగ్గిర ఏమి జరిగిందో  పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసు అధికారులను  ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని సీఎం స్పష్టం చేశారు.
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్‌గేట్‌ వద్ద సిబ్బంది టోల్‌ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు.

అంబరీష్ వాహనానికి టోల్‌ ఫీజు అడిగారు. ఎంపికొడుకు కాబట్టి టోల్ కట్టేది లేదని చెప్పారు. మినహాయింపు ఎంపికి మాత్రమేనని, మిగావారికి లేదని సిబ్బంది నచ్చచెప్పారు.  దీంతో ఎంపి గారి కుమారుడికి కోపమొచ్చింది.టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh At Mangalagiri Temple | మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం | Asianet News Telugu
Heavy Rain Alert : బలపడుతున్న అల్పపీడనం, 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ.. అతిభారీ వర్షాలతో ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే