పోలీసులకే అరెస్టు వారెంటు !

First Published Dec 22, 2017, 1:24 PM IST
Highlights
  • విధులు, బాధ్యతలు మరచిపోయిన వారికి మరోకరు ఆ విషయాలను గుర్తు చేయాల్సి రావటం నిజంగా బాధాకరమే.

విధులు, బాధ్యతలు మరచిపోయిన వారికి మరోకరు ఆ విషయాలను గుర్తు చేయాల్సి రావటం నిజంగా బాధాకరమే. అందులోనూ ప్రజా జీవితంతో ముడిపడిన ఉద్యోగస్తుల విషయంలో అయితే మరీ దారుణం. ఇంతకీ విషయం ఏమిటంటే, కోర్టు పోలీసులకే అరెస్టు వారెంటు జారీ చేసింది. అదికూడా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

ఒక కేసులో తనను నిర్భంధించి, చిత్రహింసలకు గురి చేశారంటూ జగ్గయ్యపేట పోలీసులపై బాధితుడు సాంబశివరావు ఫిర్యాదు చేసాడు. అయితే, పోలీసులపైనే ఎవరైనా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవరైనా తీసుకుంటారా? ఇక్కడ కూడా అదే జరిగింది. బాధితుడి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దాంతో బాధితుడు జగ్గయ్యపేటలోనే ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేసాడు. విచారణకు స్వీకరించిన కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. అయినా సరే, విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు నిరాకరించారు.

దాంతో ఒళ్ళమండిపోయిన జగయ్యపేట ఫస్ట్ క్లాస్  జ్యూడిషల్ మేజిస్ట్రేట్ జగ్గయ్యపేట సిఐ లచ్చునాయక్, ఎస్ఐ ప్రియకుమార్, కానిస్టేబుల్ హరిబాబులకు శుక్రవారం ఉదయం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

click me!