పరువు నష్టం కేసు .. గోనుగుంట్ల సూర్యనారాయణ, నిమ్మల కిష్టప్పలపై అరెస్ట్ వారెంట్

Siva Kodati |  
Published : Mar 27, 2023, 04:02 PM IST
పరువు నష్టం కేసు .. గోనుగుంట్ల సూర్యనారాయణ, నిమ్మల కిష్టప్పలపై అరెస్ట్ వారెంట్

సారాంశం

పరువు నష్టం కేసులో అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పలపై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పలపై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వీరిద్దరూ 2019లో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి.. ఇద్దరిపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో వాయిదాలకు హాజరుకాకపోవడంతో విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు అనంతపురం టూటౌన్, గోరంట్ల పీఎస్‌లకు అరెస్ట్ వారెంట్లను రెఫర్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ