పోలీసులకు సవాల్ గా మారిన దంపతుల హత్య కేసు...

By Bukka Sumabala  |  First Published Aug 10, 2022, 7:18 AM IST

పెందుర్తిలో ఒకే ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ దంపతుల హత్య మిస్టరీగా మారింది. అంతకు ముందు నెలలో ఇలాంటా వాచ్ మెన్ గా ఉన్న తల్లీకొడుకులపై దాడి ఘటనకు దీనికి సంబంధం ఉందేమో అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 


పెందుర్తి : విశాఖపట్నం జిల్లా పెందుర్తి జీవీఎంసీలో 97వ వార్డు చిన్నముసిడివాడ సప్తగిరి నగర్ లో సోమవారం జరిగిన దంపతుల హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. పలువురు అనుమానితులను విచారించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం వెస్ట్జోన్ ఏసీపీ అశోక్ కుమార్, సిబ్బంది సంఘటన ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు. దగ్గరలోని రోడ్లు, ఇల్లు, దుకాణాలు వంటి ప్రదేశాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని కూడా  పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఆధారాలు లభిస్తే అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. అసలు హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది?  ఉద్దేశ్యపూర్వకంగా చేశారా?  పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాల మీద సందిగ్దత నెలకొంది. సప్తగిరి నగర్ లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న అప్పారావు, బలక్ష్మీ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. 

అలాంటి ఘటనే..
పెందుర్తిలో అంతకు ముందు నెల రోజుల క్రితం జరిగిన ఓ ఘటన సోమవారం నాటి ఘటనను పోలి ఉండటంతో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గత నెల 9వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి దరి ఎ.వెలగవలస గ్రామానికి చెందిన  తల్లి కుమారుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారు కూడా పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో కాపలా దారులుగా పని చేయడం గమనార్హం. సరిగ్గా నెల రోజుల తర్వాత తాజా ఘటన అదే తరహాలో చోటుచేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Latest Videos

undefined

రాజకీయాల్లోకి సిగ్గులేనోళ్లు.. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూడాల్సిందేనా : మాధవ్ వీడియోపై చంద్రబాబు

ఇదిలా ఉండగా, నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక కానిస్టేబుల్ ను కొందరు అటకాయించి.. అతి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలు దాటాక చోటుచేసుకుంది. నంద్యాల పోలీసులు, ఆటోడ్రైవర్ తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గూడూరు సురేంద్ర కుమార్ (35) క్లర్క్ గా పని చేస్తున్నాడు.  అతను ఆదివారం రాత్రి విధులు ముగించుకుని డిఎస్పి కార్యాలయం నుంచి మోటార్సైకిల్ పై ఇంటికి వెళుతున్నాడు. థియేటర్ సమీపంలో ఆరుగురు వ్యక్తులు ఆయనను అటకాయించారు.

అక్కడే ఉన్న ఓ ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటో డ్రైవర్ పై కత్తి పెట్టి నంద్యాల శివారులోని చెరువు కట్టపైకి తీసుకువెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ ను కత్తితో గుండెలపై, వీపులో పొడిచారు. ఆ తరువాత అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ.. అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని డ్రైవర్ కు చెప్పారు. ఆ తరువాత మధ్యలో దిగి పరారయ్యారు. ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్ ను ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఎస్పి రఘువీర్ రెడ్డి, డీఎస్సీ మహేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రౌడీషీటర్లే ఈ దారుణానికి ఒడిగట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!