రాజకీయాల్లోకి సిగ్గులేనోళ్లు.. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూడాల్సిందేనా : మాధవ్ వీడియోపై చంద్రబాబు

By Siva KodatiFirst Published Aug 9, 2022, 7:54 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఆంబోతులు బట్టలు విప్పి తిరుగుతుంటే చూస్తే వుండాల్సి వస్తోందని .. సిగ్గులేనోళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. 

వైసీపీ (ysrcp) ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) న్యూడ్ వీడియో ఎపిసోడ్‌పై తీవ్రంగా స్పందించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తప్పును కప్పిపుచ్చుకునేందుకు కుల, మతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆంబోతులు బట్టలు విప్పి తిరుగుతుంటే చూస్తే వుండాల్సి వస్తోందని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. సిగ్గులేనోళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన అన్నారు. వూరుకోక ఆంబోతులు తయారవుతున్నారని.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలినోళ్లని చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ముఖ్యమంత్రి, పార్టీ అధినేత హోదాలో వున్న జగన్ (ys jagan) .. ఇలాంటి తప్పులు చేసిన వ్యక్తుల్ని పిలిచి వార్నింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులు పేట్రెగిపోతున్నారని.. రౌడీలే పోలీసులను చంపే పరిస్ధితి వుండటం దుర్మార్గమన్నారు. ఒక్క ఎన్నికలోనూ గెలవలేని గుమాస్తా.. ఏడుసార్లు గెలిచిన తన గురించి మాట్లాడతాడా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశంలో వుండగానే గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఓ వైసీపీ నేత ఆమెను బెదిరించాడని ఆయన మండిపడ్డారు. ఎంపీ చేసిన పనిని కప్పిపుచ్చడానికి వైసీపీ పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక మహిళా నేతనే ఫోన్ చేసి బెదిరిస్తుంటే.. సామాన్య మహిళల పరిస్ధితి ఏంటనీ టీడీపీ అధినేత ప్రశ్నించారు. 

Also Read:గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : ‘‘ మీ వాళ్లు చేయలేదా ’’ .. కుప్పంలో టీడీపీ నిరసనను అడ్డుకున్న సీఐ

ఇక, గోరంట్ల న్యూడ్ వీడియో, మహిళలకు కరువవుతున్న రక్షణ, పోలీస్, రాజకీయ నిర్బంధాలు, వేధింపులపై చర్చించడానికి నేడు ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అనిత.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సంభాషణ అందరికీ వినిపించారు. మీడియా ముందే అతనితో మాట్లాడారు. 

ఫోన్ చేసిన వ్యక్తి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌  వ్యవహారంపై అతిగా స్పందించవద్దని అనితను హెచ్చరించాడు. దర్యాప్తు జరుగుతుండగా ఎందుకు అనవసరమైన చర్చ అని ప్రశ్నించాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే బాధ అనిపిస్తుందని చెప్పాడు.  ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే కేవలం మాధవ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని దుమ్ము లేపద్దని అన్నారు. తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృ‌ష్ణా రెడ్డి చెప్పారని అన్నారు. 

click me!