మెడనొప్పితో వెళితే కాటికి... కార్పోరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలి

Arun Kumar P   | Asianet News
Published : Dec 27, 2020, 01:12 PM IST
మెడనొప్పితో వెళితే కాటికి... కార్పోరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలి

సారాంశం

ఆరోగ్యశ్రీ ద్వారా సరయిన వైద్యం అందదని... డబ్బు చెల్లిస్తే మెరుగైన వైద్యం అందుతుందని అని వైద్యులు తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

తాడేపల్లి: కార్పొరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యింది. మెడ నొప్పితో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి సరయిన సమయంలో సరయిన వైద్యం అందక మృత్యువాతపడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా సరయిన వైద్యం అందదని... డబ్బు చెల్లిస్తే మెరుగైన వైద్యం అందుతుందని అని వైద్యులు తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం  10వేల రూపాయలతో వైద్యం అయిపోతుందని చెప్పి రూ.3 లక్షలు వసూల్ చేశారని తెలిపారు. ఇంత ఖర్చు చేసినా డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పేషంట్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడిన మెరుగైన వైద్యం అందలేదన్నారు. ముఖ్యంగా సర్జన్ రవికాంత్ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త ప్రాణం పోయిందని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై హాస్పిటల్ కు వచ్చిన భర్తని శవ పేటికలో పెట్టి అప్పచెప్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.   

ఈ చర్యలతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. ఈ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు తాడేపల్లి పోలీసులు. సదరు హాస్పిటల్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu