ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు: మొత్తం 193 మంది మృతి

By telugu teamFirst Published Jul 1, 2020, 1:35 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేల మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 193 మంది కోవిడ్-19తో మరణించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 611 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 39 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  తద్వారా రాష్ట్రంలో గత 24 గంటల్లో 657 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఏపీలో తాజాగా గత 24 గంటల్లో ఆరుగురు మరణిం్చారు. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 193కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 28,239 శాంపిల్స్ ను పరీక్షించారు. గత 24 గంటల్లో 342 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 

ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 9 లక్షల 18 వేల 429 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వైరస్ రోగుల్లో 8071 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాో 118 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, తూర్పు గోదావరి జిల్లాలో 80, గుంటూరు జిల్లాలో 77, కడప జిల్లాలో 60, కృష్ణా జిల్లాలో 52, కర్నూలు జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. 

నెల్లూరు జిల్లాలో 33, ప్రకాశం జిల్లాలో 28 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో 21, విజయనగరం జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చివారిలో ఇప్పటి వరకు 2036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 403 కేసులు నమోదయ్యాయి. 


జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 1689, మరణాలు 8
చిత్తూరు 1089, మరణాలు 6
తూర్పు గోదావరి 1209, మరణాలు 7
గుంటూరు 1426, మరణాలు 18
కడప 1000, మరణాలు 1
కృష్ణా 1519, మరణాలు 66
కర్నూలు 2045, మరణాలు 68
నెల్లూరు 641, మరణాలు 6
ప్రకాశం 398, మరణాలు 2
శ్రీకాకుళం 63, మరణాలు 2
విశాఖపట్నం 563, మరణాలు 3
విజయనగరం 161, మరణాలు 2
పశ్చిమ గోదావరి 1010, మరణాలు 4

 

: 01/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,813 పాజిటివ్ కేసు లకు గాను
*5587 మంది డిశ్చార్జ్ కాగా
*193 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,033 pic.twitter.com/S3DDSqZSxv

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!