ఏపీలో కరోనా విజృంభణ: 10 వేలు దాటిన కేసులు, ఒక్క రోజే 10 మంది మృతి

By telugu team  |  First Published Jun 24, 2020, 2:04 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఒక్క రోజులోనే పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో కోవిడ్ -19 మరణాల సంఖ్య 129కి చేరుకుంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 497 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారిలో 448 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 37 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,331కి చేరుకుంది. 

Latest Videos

undefined

తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది మంది కరోనా వైరస్ బారిన పడిన మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య129కి చేరుకుంది.  కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్ాలలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. 

రాష్ట్రంలో 36,047 శాంపిల్స్ ను పరీక్షించగా 448 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిదార్ణ అయినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ద్వారా తెలుస్తోంది.  

గత 24 గంటల్లో అత్యధికంగా 90 కేసులు అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 40, తూర్పు గోదావరి చజిల్లాో 54, గుంటూరు జిల్లాలో 39, కడప జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 36, కర్నూలు జిల్లాలో 76, నెల్లూరు జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో 41, విజయనగరం జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 8306 కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 364 కేసులు నమోదయ్యాయి. 

జిల్లాలవారీగా నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాలు 

అనంతపురం 1028 మరణాలు 7
చిత్తూరు 657 మరణాలు 6
తూర్పు గోదావరి 760 మరణాలు 5
గుంట్ూరు 891 మరణాలు 14
కడప 478 మరణాలు 1
కృష్ణా 1132 మరణాలు 43
కర్నూలు 1483 మరణాలు 42
నెల్లూరు 493 మరణాలు 4
ప్రకాశం 200 మరణాలు 2
శ్రీకాకుళం 60 మరణాలు 2
విశాఖపట్నం 367 మరణాలు 2
విజయనగరం 94 మరణాలు సున్నా
పశ్చిమ గోదావరి 663, మరణాలు 1

 

: 24/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8306 పాజిటివ్ కేసు లకు గాను
*3712 మంది డిశ్చార్జ్ కాగా
*129 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4465 pic.twitter.com/U4XVIW1Qhv

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!