వైయస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్

By Sreeharsha GopaganiFirst Published Jun 24, 2020, 1:34 PM IST
Highlights

‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని నేడు  సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.  క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకం ప్రారంభించిన తర్వాత, జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాదారు ముఖ్యమంత్రి జగన్. 

 

‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని నేడు  సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.  క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకం ప్రారంభించిన తర్వాత, జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాదారు ముఖ్యమంత్రి జగన్. 

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... "మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది." అని అన్నారు. 

ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశామని, గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగిందని, ఎక్కడా వివక్షకు తావునివ్వలేదని, ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని తమ ప్రభుత్వం ఆరాటపడిందని అన్నారు జగన్. 

అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశామని, కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదని, ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే..

అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4770 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని అన్నాడు. 

బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించేందుకు కృషి చేస్తామని అన్నాడు. 

పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నామని, ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం తమ వైసీపీ ప్రభుత్వము అని జగన్ అన్నారు. 

అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారని, పేరు లేకపోతే, కు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తామని, గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 

గత ప్రభుత్వంచెప్పినదానికి చేసినదానికి పోలికలేదు అని జగన్ అన్నాడు. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చిందని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేవుడి దయతో, అందరి ఆశీస్సులతో అందరికీ ఇంకా మంచి చేయాలని భావిస్తున్నానని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 

click me!