కరోనావైరస్: కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎస్ నీలం సాహ్నీ

By telugu teamFirst Published Mar 22, 2020, 9:36 AM IST
Highlights

కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాల్సిన తీరుపై ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి:  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లోను చర్యలు చేపడుతూ సాధారణ పరిపాలన శాఖ కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లుగా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. 

ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. అటు హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లోను రెండు గ్రూప్ లుగా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని ప్రభుత్వం తెలిపింది. గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. 60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారులు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు నీలం సాహ్నీ ఆదేశాలు ఇచ్చారు. 

Also Read: ఏపీలో మరో రెండు కరోనా కేసులు: ఐదుకు పెరిగిన సంఖ్య

50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకోశ సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు ఏప్రిల్ 4 తేదీ వరకు ఇంటి వద్దే వైద్య ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ఉద్యోగులకు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు లో హాజరుకు అనుమతి ఇచ్చారు. 

ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో తెలిపారు. 

Also Read: కరోనా కట్టడికి ఆ రాష్ట్రాన్ని ఫాలో అవ్వండి: జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని ప్రభుత్వం తెలిపింది. వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి లేదని నీలం సాహ్నీ తెలిపారు. సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని నీలం సాహ్నీ తెలిపారు.

click me!