కరోనా: జనతా కర్ఫ్యూ కు జై కొట్టిన బెజవాడ, ఇళ్లలో అమరావతి రైతుల దీక్ష

By telugu teamFirst Published Mar 22, 2020, 10:20 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. అమరావతి రైతులు తమ ఇళ్లలో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సహకరిస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  బందరు రోడ్,ఏలూరు రోడ్ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్ బోసిపోయి కనిపించాయి. మాల్స్, సినిమహల్స్,పెట్రోల్ బంక్ లు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.

ఉదయం 7లోగా పాలు నీళ్లు, నిత్యవసర సరుకులు సమకూర్చుకున్నారు. మద్యం, మాంసాహారాల కోసం రాత్రే బారులు తీరారు. అత్యవసర సేవల కోసం పోలీసులు, వైద్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది, మీడియా సిద్ధంగా ఉన్నాయి. జనతా కర్ఫ్యూ తో కుటుంబ అనుబంధం బలపడింది.ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. కరోనా వైరస్ కట్టడి అక్కడక్కడ అవసరాల కోసం కొద్దిమంది బయట తిరిగారు. విజయవాడ వాసులుసెల్ ఫోన్లు, టివిలతో కాలక్షేపం చేస్తున్నారు.

Also Read: కరోనావైరస్: కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎస్ నీలం సాహ్నీ

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రూరల్ సర్కిల్ పరిధిలోని మండల కేంద్రమైన మాచవరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రత్తయ్య ఆధ్వర్యంలో మాచవరం ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి కర్ఫ్యూ పరివేక్షణ నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది సీఐ తో పాటు ఆ ప్రాంత పోలీస్ అధికారులు కూడా సిబ్బంది పగడ్బందీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు 

Also read: ఏపీలో మరో రెండు కరోనా కేసులు: ఐదుకు పెరిగిన సంఖ్య

గత 95 రోజులనుండి రోజు వందలమందితో రద్దీగా ఉండే అమరావతి ప్రాంతాల్లోని దీక్షా శిబిరాలు ఆదివారం 96వ రోజు కరోనా కర్ఫ్యూ కారణంగా బోసిపోయాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని గ్రామాలలో 96వ రోజు దీక్షలను ఉదయం 6 గంటలనుండి 7 వరకు జనతా కర్ఫ్యూను పాటిస్తామని చెప్పారు. ఒక గంట పాటు మాత్రమే రైతులు దీక్షసాగించారు. మోడీ పిలుపు మేరకు కర్ఫ్యూకి సహరిస్తున్నామని, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని రైతులు చెప్పారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  పిలుపు మేరకు కు జనతా కర్ఫ్యూ లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేశారు. కరోనా మహమ్మారిని అంతమొందించటమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛందంగా ప్రజలు ఈ జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు..

click me!