క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రభుత్వం ఎలాంటి ఆహారం అందిస్తోంది, అక్కడ పరిస్ధితులు ఎలా ఉన్నాయి అనే దానిపై నిత్యం చర్చ జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల క్వారంటైన్ల నిర్వహణ సరిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో క్లారిటీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మొదట్లో ఒకటీ, ఆరా కేసులు నమోదై పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని అనిపించినప్పటికీ, ఆ తర్వాత మర్కజ్ ఉదంతంతో కేసులు పెరిగిపోయాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 348 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, నలుగురు మరణించారు. ఇదిలా వుంటే ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితో పాటు పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబాలను అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
Also Read:కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు
ఇదే సమయంలో క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రభుత్వం ఎలాంటి ఆహారం అందిస్తోంది, అక్కడ పరిస్ధితులు ఎలా ఉన్నాయి అనే దానిపై నిత్యం చర్చ జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల క్వారంటైన్ల నిర్వహణ సరిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్య ఆంధ్ర ఓ ట్వీట్ చేసింది. బెజవాడలోని క్వారంటైన్ వార్డుల్లో ఆహారానికి సంబంధించి ఫోటో షేర్ చేసింది.
Also Read:య్యలూరులో ఉద్రిక్తత: క్వారంటైన్ కు తరలింపు అడ్డగింత, వెనుదిరిగిన పోలీసులు
వారిలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు గాను పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారు అధికారులు. రెండు గుడ్లు, రెండు అరటి పండ్లు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఏదో ఒక జ్యూస్ మెనూలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.