చంద్రబాబుకు సోకింది ఆ వైరసే... భయపడే హైదరాబాద్ కు: వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Apr 09, 2020, 07:14 PM IST
చంద్రబాబుకు సోకింది ఆ వైరసే... భయపడే హైదరాబాద్ కు: వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

సారాంశం

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి తో బాధపడుతుంటే టిడిపి అధ్యక్షులు చంద్రబాబుకు మాత్రం కుట్ర కుతంత్రాలు వైరస్ సోకిందని వైసిపి ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మండిపడ్డారు. 

తాడేపల్లి: ప్రపంచానికి సోకింది కరోనా వైరస్ చంద్రబాబు మెదడుకు సోకింది కుట్ర కుతంత్రాలు వైరస్ అని వైస్సార్సీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున విమర్శించారు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని... ముఖ్యమంత్రి జగన్ ని తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ఒక శికండిలా సుధాకర్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నాగార్జున మండిపడ్డారు. 

సుధాకర్ అనే డాక్టర్ టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి వచ్చిన తరువాతే వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లుగా తిట్టాడన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 

''డాక్టర్ సుధాకర్ అడ్డగాడిదలా మాట్లాడితే తాము ఊరుకోవాలా. చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తి డాక్టర్ సుధాకర్. అతడి ఉచ్చులో సుధాకర్ పడ్డాడు.  సుధాకర్ ను ఇప్పుడు పావులాగా వాడుకుంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు తర్వాత నడిరోడ్డుపై వదిలేస్తారు'' అని అన్నారు. 

''అంబేడ్కర్ విలువలుకు సుధాకర్ తిలోదకాలు ఇస్తున్నాడు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటున్నారా అని గతంలోనే చంద్రబాబు హేళన చేశారు. దళితులు మురికి వాళ్ళు అని టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అంతటితో ఆగకుండా దళితులపై దాడులు చేశారు. ఇలాంటి చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు'' అని నాగార్జున విమర్శించారు. 

''అధికారంలో వున్నప్పుడు దళితుల సంక్షేమనికి చంద్రబాబు తూట్లు పొడిచాడు. ఇప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ ను ఉపయోగించి ఆయన చేసిన ఆపరేషన్ వికటించింది'' అని అన్నారు. 

''మాస్కలు లేకపోతే సుధాకర్ అధికారులకు ఫిర్యాదు చెయాలి గానీ ఇలా రాజకీయ విమర్శలు చేయడమేంటి. సుధాకర్ దళితుడు అయినందుకు సిగ్గుపడుతున్నాను. 60 శాతం మంత్రి పదవులు బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు.అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా దళితులు లాభపడ్డారు. గ్రామ వార్దు సచివాలయంలో ఉద్యోగాలు ఎస్సి ఎస్టీ బీసీలకు అధికంగా వచ్చాయి'' అని పేర్కొన్నారు. 

''కరోనాకు భయపడి హైదరాబాద్ పారిపోయిన ముసలి నక్క చంద్రబాబు. దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.యూనివర్సిటీ పాలకమండలి లో అవతక జరిగాయని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని ఎమ్మెల్యే నాగార్జున మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu