ఏపీలో మరో 34 కరోనా కేసులు: మొత్తం 473కి చేరిక

By narsimha lode  |  First Published Apr 14, 2020, 11:45 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 గంటల వ్యవధిలో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 473కి చేరుకొన్నాయి.16 గంటల్లో అత్యధికంగా 16 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 గంటల వ్యవధిలో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 473కి చేరుకొన్నాయి.16 గంటల్లో అత్యధికంగా 16 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఎనిమిది, కర్నూల్ లో ఏడు, అనంతపురంలో 2, నెల్లూరులో 1, గుంటూరులో 16 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారిలో 14 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
 

రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 16, కృష్ణ లో 8, కర్నూల్ లో 7, అనంతపూర్ లో 2 మరియు నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసుల తో రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది. pic.twitter.com/WkAzHGTuJC

— ArogyaAndhra (@ArogyaAndhra)

ఈ వైరస్ సోకి తొమ్మిది మంది మృతి చెందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 24 గంటల్లో 2010 శాంపిల్స్ పరీక్షిస్తే 41 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 109 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్నూల్  జిల్లా నిలిచింది. కర్నూల్ జిల్లాలో 91కి చేరుకొంది.నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది.ప్రకాశంలో 42 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన కేసులు

అనంతపురం- 17
చిత్తూరు-23
తూర్పు గోదావరి-17
గుంటూరు -109
కడప-31
కృష్ణా-44
కర్నూల్-91
నెల్లూరు-56
ప్రకాశం-42
విశాఖపట్టణం-20
    





 
click me!