జగన్ కు శాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్...లక్షణాలివే: బుద్దా వెంకన్న సెటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Apr 14, 2020, 10:47 AM IST
జగన్ కు శాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్...లక్షణాలివే: బుద్దా వెంకన్న సెటైర్లు

సారాంశం

రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో వున్న సమయంలో ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి ఏపి ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేస్తున్నాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించాడు.  

విజయవాడ: కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం రాజకీయాలపైనే దృష్టి పెట్టారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. దేశంలోని అందరు సీఎంలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరితే ఒక్క జగన్ మాత్రమే ఎత్తేయాలని అంటున్నాడని... ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఇలా అనేవాడు  కాదన్నారు. తన మూడుముక్కల రాజధాని ఆలోచన భాగంగా విశాఖకు రాజధానిని తరలించాలన్న ఆత్రుతతో లాక్ డౌన్ ఎత్తివేతకు డిమాండ్ చేస్తున్నారని వెంకన్న ఆరోపించారు. 

''క‌రోనా వైర‌స్‌ వీసా పై విశాఖ‌-విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్‌-ఢిల్లీ మ‌ధ్య తిరుగుతున్న‌ ఎంపీ విజయసాయి రెడ్డి గారూ అల్లుడుగారి శ్రేయస్సు కోరి మీరు కోల్‌క‌తా హోట‌ల్లో చేసిన పనులు మ‌రిచిపోవ‌ద్దు'' అంటూ విజయసాయి రెడ్డిపై ట్విట్టర్ వేదికన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

''వైఎస్ జగన్ గారిక శాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్(Sadistic personality disorder)ఉంది.ఈ వ్యాధి పక్కనే ఉండే ఏ2 నుండి సోకింది. ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించడం,కక్ష తీర్చుకోవడం ఈ వ్యాధి లక్షణం'' అంటూ జగన్ పై సెటైర్లు విసిరారు. 

''ఇప్పుడు ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టిది మరోదారి అన్నట్టుగా ఉంది జగన్ గారి వ్యవహారశైలి. దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు మరో రెండు వారాలు లాక్ డౌన్ విధించాలి అంటుంటే''

''జగన్ మాత్రం లాక్ డౌన్ అవసరం లేదు రాజకీయమే ముఖ్యం అంటున్నారు.ప్రజల ప్రాణాలు పోతే ఏంటి నేను మూడు ముక్కల రాజధానిలో భాగంగా అర్జెంట్ గా విశాఖపట్నం వెళ్ళిపోవాలి అనడం ఆయన శాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ కి నిదర్శనం'' అని విమర్శించారు. 

''విజయసాయి రెడ్డి గారు, సీఎం జగన్ గారు ఇచ్చే మాస్కులు పేద ప్రజల ఆకలి తీర్చలేవు. మూడు మాస్కులతో పాటు పేదలకు 5 వేల ఆర్థిక సహాయం కూడా పంపితే ప్రజలు ఆకలి తీరుతుంది. కరోనా దెబ్బకి పనులు లేక ప్రజలు అల్లాడుతున్నారు'' 

''తక్షణమే వారిని ఆదుకోవడానికి 5 వేల రూపాయిల తక్షణ సహాయం విడుదల చెయ్యాలి. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.తక్షణమే పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలి'' అని సూచించారు. 

''అలాగే కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు,  మున్సిపాలిటీలకు ఇచ్చిన డబ్బుని ఫ్రీజ్ చేసి ఇతర అవసరాలకు వాడుకున్నారు. ఆ సొమ్ము ఉంటే గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది'' అంటూ జగన్ పై విమర్శలు చేస్తూనే వైసిపి ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలిచ్చారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?