నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం..

By AN TeluguFirst Published Apr 30, 2021, 10:59 AM IST
Highlights

కృష్ణాజిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ సోకడంతో కొందరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ అధికారులు ఇంటికి పంపించారు.  

కృష్ణాజిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ సోకడంతో కొందరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ అధికారులు ఇంటికి పంపించారు.  

ఇప్పటికే కరోనా సోకి  ట్రిపుల్ ఐటీ లాబ్ అసిస్టెంట్ లీలా మురళి కృష్ణ(42) మరణించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం మురళి కృష్ణ చనిపోయాడు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  

అయితే ఈ పరీక్ష రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా కరోనా విలయతాండవం చేస్తున్నా సిబ్బంది యధావిధిగా విధులు నిర్వహిస్తుండడంతో, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఏదేమైనా వైరస్ తీవ్రత ఇంకా పెరగకముందే ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!