అమరావతి దీక్షలు @ 500 : స్త్రీలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు.. చంద్రబాబు

By AN TeluguFirst Published Apr 30, 2021, 10:12 AM IST
Highlights

ప్రజా రాజధాని అమరావతి పరిర్షన ఉద్యమానికి 500 రోజులు అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భావోద్వేగ భరితమైన ట్వీట్ చేశారు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేలమంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే.. 500 రోజుల్లో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారని వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !’ అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్లతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు అని మండిపడ్డారు.

పాలకులు ఎంత నిర్ధయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న దీక్ష 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసింది. అమరావతి ఉద్యమ భేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ జరుగుతుంది.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సభ జరగనుంది. దీంట్లో లక్ష మంది పాల్గొనే విధంగా అమరావతి ఐకాస ఏర్పాట్లు చేసింది. రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు పలికాయి. ఏడాదిన్నరగా జరుగుతున్న ఉద్యమాన్ని మహిళలు ముందుండి నడిపిస్తున్నారు.

2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు.  ఆ తరువాత 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో ఉద్యమం మొదలయ్యింది. రాజధాని గ్రామాల్లో 3 వేలమందికి పైగా వివిధ కేసులు నమోదయ్యియి.రాజధాని చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరిగింది. 
 
click me!