విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 50 మందికి కరోనా పాజిటివ్...

By SumaBala Bukka  |  First Published Jan 18, 2022, 10:11 AM IST

Vijayawada ప్రభుత్వ ఆస్పత్రిలో Corona virus కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి Corona positive గా నిర్థారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 


విజయవాడ : Vijayawada ప్రభుత్వ ఆస్పత్రిలో Corona virus కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి Corona positive గా నిర్థారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదిలా ఉండగా, andhrapradesh లో కరోనా విజృంభిస్తోంది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విసయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే తాను హోం ఐసోలేష్ లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. 

Latest Videos

undefined

అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తనతో కాంటాక్టులోకి వచ్చినవారు, తనను కలిసినవారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయన కుమారుడు లోకేష్ కరోనా బారిన పడ్డారు. 

సోమవారం లోకేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ట్విటర్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు లోకేష్. అయితే తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు వెల్లడించారు. తనతో కాంటాక్టులోకి వచ్చినవారు, తనను కలిసినవారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

కాగా, సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్బంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను అధికారులు వివరించారు. సెకండ్ వేవ్‌తో పోలిస్తే.. కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచినట్టుగా చెప్పారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రికాషస్ డోస్‌ వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సందర్భంగా..104 కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని సీఎం జగన్ అదేశించారు. టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్ వ్యాక్సిన్ పంపిణీ కాస్తా తక్కువగా ఉందని.. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వ్యాక్సినేషన్‌ ఉధృతంగా కొనసాగించాలన్నారు. 

click me!