గుంటూరులో చెరువులో పడ్డ కారు..నలుగురు మృతి (వీడియో)

By SumaBala Bukka  |  First Published Jan 18, 2022, 9:01 AM IST

ఈ ప్రమాదంలో కొండవీటి వెంకటేశ్వర్లు, సిహెచ్ నారాయణ రావు, సిహెచ్ సురేష్, తేజ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన నలుగురు లో ముగ్గురు యువకులు మంగళగిరి ప్రాంతానికి చెందిన వారిగా, ఒకరు యర్రబాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు


సోమవారం నాడు ఘోర road accident జరిగింది. ఓ car అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.  AP 16 సీఈ 5328 నెంబర్ కలిగిన కారులో నలుగురు ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. కృష్ణాయ పాలెం నుండి వస్తుండగా యర్రబాలెం గ్రామం చెరువు వద్దకు వచ్చే సరికి వాహనం అదువుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 

"

Latest Videos

ఈ ప్రమాదంలో కొండవీటి వెంకటేశ్వర్లు, సిహెచ్ నారాయణ రావు, సిహెచ్ సురేష్, తేజ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన నలుగురు లో ముగ్గురు యువకులు మంగళగిరి ప్రాంతానికి చెందిన వారిగా, ఒకరు యర్రబాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
 
కారు నెంబర్ ఆధారంగా పోలీసులు మృతుల వివరాలు సేకరించారు. మృతులు విస్సన్న పేట మండలం పుట్రేల వాసులుగా గుర్తించారు. కారు ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. చెరువులో నుంచి కారును స్థానికులు బయటకు తీశారు. మృతులు యువకులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా, జనవరి 12న guntur  జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  మాచర్ల ఎమ్మెల్యే బంధువులు ప్రయాణిస్తున్న కారు  ప్రమాదానికి గురైంది.  స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాచర్ల ఎమ్మెల్యే Pinnelli Ramakrishnareddy చిన్నాన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కారులో వెళ్తుండగా దుర్గి మండలం అడిగోప్పల వద్దకు రాగానే అదుపుతప్పి Sagar Canalలోకి దూసుకెళ్లింది. 

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు.కారులో ఉన్న ఆయన భార్య,ఇద్దరు పిల్లలు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సాగర్ కాలువలో పడిన కారును అధికారులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కారును వెతికేందుకు పెద్ద క్రేన్ ను తీసుకువచ్చారు.  ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  అధికారులు కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.

ఇదిలా ఉండగా, జనవరి 5న తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన కారును పోలీసులు 5వ తేదీ ఉదయం క్రేన్ సాయంతో వెలికితీశారు. ఆ కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన గుండవేని ప్రసాద్, పుదరి రేవంత్‌‌లు.. తమ ఊరి నుంచి సమీపంలోని ఆత్మకూరుకు సోమవారం రాత్రి బయలుదేరారు. అయితే మరసటి రోజు ఉదయం అయిన కూడా వారు ఆత్మకూరు చేరుకోలేదు. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగి మెట్‌పల్లి నుంచి వెల్లుల్ల మార్గంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఆ మార్గంలో అందుబాటులో సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో వెల్లుల్ల శివారులోని కాకతీయ కాలువ ఉన్న వంతెన రెయిలింగ్ కూలిపోయి ఉండటం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఈ వంతెనపై నుంచే మెట్‌పల్లి నుంచి ఆత్మకూరు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు కారు రెయిలింగ్‌ను ఢీకొని కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లి ఉంటుందని అనుమానించారు. 
 

click me!