ప్రధాని కాళ్లు కడిగిన వారిచేతే జగన్ కన్నీళ్లు పెట్టిస్తున్నారు...: వర్ల రామయ్య ధ్వజం

By Arun Kumar PFirst Published Apr 24, 2020, 6:37 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా నివారణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుద్ద్య పనులు చేపడుతున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

గుంటూరు: సకాలంలో జీతాలు చెల్లించి పారిశుద్ధ్య కార్మికుల ఈతి బాధలను సత్వరం పరిష్కరించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు.  గత 11 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక, విధులు బహిష్కరించి గత్యంతరం లేనిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై నిరసనను తెలపడాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. కరోనా నేపధ్యంలో డాక్టర్లు, పోలీసులతోపాటు పారిశుద్ధ్య కార్మికులను ఏపీ ప్రభుత్వం గౌరవించి ఆదుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని వర్ల సూచించారు. 

ఆకలితో అల్లాడుతున్న సామాన్య పారిశుధ్యకార్మికుల వేతనాలు ఇవ్వకుండా పస్తులుంచే దుశ్చర్యకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు.  కరోనా నేపధ్యంలో పారిశుద్ధ్య కార్మికుల పని తీరు భేష్ అంటూ ప్రధాని మోడీ కార్మికుల కాళ్ళు కడిగారని... ఈస్థితిలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఎగ్గొట్టి పస్తులుంచుతూ ఆవేదనకు లోను చేస్తోందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం పాలనా నిర్వహణలో అన్ని అంశాలకు సమప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను సకలసదుపాయాలు కల్పించామని కోరారు. చిరుద్యోగులకు జీతాలు చెల్లించకుండా పారిశుద్ధ్య కార్మికుల నుంచి సేవలు ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు. 

వైకాపా ప్రభుత్వంలో బడుగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆక్షేపించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లలో విరాళాలు వస్తుండగా  ప్రాధాన్యత రంగమైన పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడం పాలకుల బాధ్యతని విశిదం చేశారు. ఒక్క కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించకుండా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు జమ చేసినట్లయితే తమ విధుల్లో పూర్తి సన్నద్ధతతో మెసలుకుంటారన్నారు వర్ల రామయ్య ప్రభుత్వానికి  సూచించారు. 


 

click me!