అందుకే రమేష్ కుమార్ తొలగింపు: హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

Published : Apr 24, 2020, 06:13 PM IST
అందుకే రమేష్ కుమార్ తొలగింపు: హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

సారాంశం

రాష్ట్ర ఎన్నికల సంస్కరణలో భాగంగానే కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కేసులో హైకోర్టులో పూర్తిస్థాయి కౌంటర్ అఫిడవిట్ లో స్పష్టం చేసింది

అమరావతి:రాష్ట్ర ఎన్నికల సంస్కరణలో భాగంగానే కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కేసులో హైకోర్టులో పూర్తిస్థాయి కౌంటర్ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. 

శుక్రవారంనాడు ఏడు పేజీలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ ను హైకోర్టుకు సమర్పించింది ఏపీ ప్రభుత్వం.రిటైర్డ్ జడ్జిలను ఎస్ఈసీలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను రూపొందించినట్టుగా హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం.

ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ల పదవి కాలాన్ని కూడ అఫిడవిట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల వివరాలను కూడ ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రస్తావించింది.

also read:నిమ్మగడ్డ లేఖలో ట్విస్ట్: సీఐడీ దర్యాప్తులో సంచలనాలు, ఆధారాలు ధ్వంసం

2014లో 221 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ ఏడాది కేవలం 88 ఘటనలు మాత్రమే చోటు చేసుకొన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న ఉన్న సమయంలో రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది.పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై  నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆరోపణలు క్షేత్రస్థాయిలో అవాస్తవాలుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 

తనను ఎస్ఈసీ పదవి నుండి అకారణంగా తప్పించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ అవాస్తవమని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటికే ప్రాథమిక కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్