నామినేషన్ పై వందల కోట్ల పనులా ?

First Published Jan 30, 2018, 5:34 PM IST
Highlights
  • రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఏమనుకుంటే అది చేసేయొచ్చా?

రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఏమనుకుంటే అది చేసేయొచ్చా? తాజా పరిణామాలతో అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. విషయం ఏమిటంటే, నిలిచిపోయిన పోలవరం స్పిల్ వే, స్పిల్ వే ఛానల్, కాంక్రీట్ పనులను పూర్తి చేయటానికి నవయుగ కంపెనీ ముందుకు వచ్చింది. పనులను చంద్రబాబునాయుడు కట్టబెట్టేశారు. అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

గడచిన మూడున్నరేళ్ళుగా పోలవరం కాంట్రాక్టు పనులు ట్రాన్స్ ట్రాయ్ చేస్తున్న  సంగతి తెలిసిందే. ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ యాజమాన్యానికి సామర్ధ్యం లేకపోయినా టిడిడిపి ఎంపి రాయపాటి సాంబశివరాది కావటంతో చంద్రబాబు ప్రోత్సహించారు. అయితే, ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన ట్రాన్స్ ట్రాయ్ చివరకు చేతెలెత్తేసింది. ఈ విషయంలో అంచనాలు పెంచి పనులు వేరొకిరికి అప్పగించి ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు అనుకున్నారు.

అయితే, అందుకు కేంద్రం అంగీకరించలేదు. దాంతో రెండు ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. టిడిపి-భాజపా మధ్య పొత్తును ప్రభావితం చేస్తున్న అంశాల్లో పోలవరం కూడా ఒకటనటంలో సందేహం అవసరం లేదు.

ఈ నేపధ్యంలోనే నవయుగ కంపెనీ ముందుకు వచ్చింది. అంచనాలు సవరించకుండానే పాత ధరలకే తాము పనులు పూర్తి చేస్తామని ప్రతిపాదించింది. దానికి మంత్రివర్గం అంగీకరించింది. ఆమోదం కోసం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపింది. చివరకు తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకానీ మొత్తానికి కేంద్రం నవయుగకు పనులు అప్పగించటానికి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే, వందల కోట్ల రూపాయల విలువైన పనులు నామినేషన్ పద్దతిలో ఇచ్చేయొచ్చా? అన్న అనుమానం అందరిలోనూ మొదలైంది. నిబంధనల ప్రకారం లక్ష రూపాయల విలువ దాటిని ఏ పనినైనా టెండర్ల ద్వారా మాత్రమే ఫైనల్ చేయాలి. అటువంటిది వందల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను మంత్రివర్గం ఆమోదం ముసుగులో చంద్రబాబు ఇష్టప్రకారం నవయుగకు పనులు అప్పగించేశారు. ఇప్పటికే పోలవరం అంటేనే పెద్ద కుంభకోణాలమయమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా నవయుగకు కూడా నామినేషన్ మీద పనులు ఇచ్చేయటమంటే...

click me!