(వీడియో) ముగిసిన కంటైనర్ హై డ్రామా...కంటైనర్ అంతా ఖాళీ

First Published Aug 18, 2017, 10:01 PM IST
Highlights
  • వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చి తెరిచారు.
  • తాళాలు లేకపోవటంతో చివరకు పోలీసులే తాళాలను పగులగొట్టి మరీ ఓపెన్ చేసారు. 
  • వైసీపీ నేతలతో పాటు స్ధానికుల సమక్షంలో వాహనం లోపలంతా పోలీసులు తనిఖీ చేసారు.
  • వాహనం మొత్తం ఖాళీగా కనిపించింది.

దాదాపు రెండున్నర గంటల పాటు అందరిలోనూ ఉత్కంఠ రేపిన కంటైనర్ హై డ్రామా ముగిసింది. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో కంటైనర్ తెరవగా లోపల మొత్తం ఖాళీగా కనిపించింది. నంద్యాలకు సమీపంలోని గాజులపల్లెమిట్ట వద్ద ఓ కంటైనర్ ను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఏముందో చూపించమని పరిశీలకులు అడిగినపుడు డ్రైవర్ అంగీకరించలేదు. పైగా ఆ వాహనం ముఖ్యమంత్రి ప్యాంట్రీ వాహనమని, తెరిచేందుకు కుదరదని చెప్పటంతో అనుమానాలు మొదలయ్యాయి. సరే, తర్వాత జరిగిన ప్రహసనం అంతా అందరికీ తెలిసిందే.

మొత్తానికి వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చి తెరిచారు. తాళాలు లేకపోవటంతో చివరకు పోలీసులే తాళాలను పగులగొట్టి మరీ ఓపెన్ చేసారు.  వైసీపీ నేతలతో పాటు స్ధానికుల సమక్షంలో వాహనం లోపలంతా పోలీసులు తనిఖీ చేసారు. వాహనం మొత్తం ఖాళీగా కనిపించింది. గాజులపల్లెమిట్ట వద్ద వాహనం డ్రైవర్ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో అందులో కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. సుమారు రూ. 100 కోట్ల వరకూ ఉండొచ్చని  కూడా ప్రచారం జరిగింది. తీరా వాహనాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏమీ లేదని తేలింది.

అయితే ఇక్కడే పలు అనుమానాలు మొదలయ్యాయి. నిజంగానే అందులో డబ్బులు పంపుతుంటే అందరికీ అనుమానాలు వచ్చేట్లు ఎవరు పంపుతారు? పైగా వందకోట్ల రూపాయలు ఒకే వాహనంలో ఎవరైనా పంపుతారా అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయ్. ఎవరో ప్రతిపక్షాన్ని తప్పుదోవ పట్టించేందుకు కావాలనే ఈ డ్రామా ఆడినట్లుంది చూడబోతే. సరే, ఏదేమైనా శని, ఆదివారాల్లో చంద్రబాబునాయుడు నంద్యాలలో క్యాంపు వేయనున్న సమయంలోనే ఇటువంటి హైడ్రామా చోటుచేసుకోవటం గమనార్హం.

 

click me!