అక్రమ సంబంధం.. భార్య ప్రియుడిని చంపిన డీజీపీ గన్ మెన్

Published : Aug 12, 2021, 08:02 AM IST
అక్రమ సంబంధం.. భార్య ప్రియుడిని చంపిన డీజీపీ గన్ మెన్

సారాంశం

ఈ క్రమంలో వెంకటేష్  తో ఇల్లు ఖాళీ చేయించాడు. అయినప్పటికీ శివనాగరాజు లేని సమయంలో.. వెంకటేష్ వస్తూ వెళుతూ ఉండేవాడు.

అక్రమ సంబంధం ఒకరి ప్రాణం తీసింది. భర్తకు తెలీకుండా ఓ మహిళ ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. భార్య ప్రియుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటనలో నిందితుడు ఏపీ డీజీపీ వ్యక్తిగత గన్ మెన్ కావడం గమనార్హం,

విజయవాడ సిటీ ఆర్మడ్ రిజర్వు విభాగంలో శివనాగరాజు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పటమట స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర నగర్ లోని పుట్ట రోడ్డులో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఇంటిపై పెంట్ హౌస్ లో మచిలీపట్నంకు చెందిన వెంకటేష్(24) నివాసం ఉండేవాడు.  స్థానిక ఆటోనగర్ లో ఐస్ క్రీమ్ దుకాణనం నడిపేవాడు.

కాగా.. కానిస్టేబుల్ భార్య తో వెంకటేష్ కి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కానిస్టేబుల్ శివనాగరాజుకి తెలియడంతో... పలుమార్లు భార్యను మందలించాడు. అయినా భార్య తీరులో మార్పురాలేదు. ఈ క్రమంలో వెంకటేష్  తో ఇల్లు ఖాళీ చేయించాడు. అయినప్పటికీ శివనాగరాజు లేని సమయంలో.. వెంకటేష్ వస్తూ వెళుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో గత ఆరునెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానిస్టేబుల్ భార్య పుట్టింటికి వెళ్లగా... పెద్దలు నచ్చచెప్పి.. మళ్లీ ఇక్కడకు పంపించారు. అయితే.. భర్తకు తెలీకుండా ఆమె ప్రియుడు వెంకటేష్ తో ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇటీవల అతనిని విజయవాడకు రాగా.. భర్త లేని సమయంలో ఇంటికి రమ్మని పిలిచింది.

అతను కానిస్టేబుల్ ఇంటికి రావడానికి స్థానికులు గుర్తించి డ్యూటీలో ఉన్న అతనికి సమాచారం అందించాడు. దీంతో.. ఆవేశంతో అక్కడకి వచ్చిన కానిస్టేబుల్ వెంటకేష్ చేతులు, కాళ్లు కొట్టేసిా.. విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు కానిస్టేబుల్ ని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu