న్యూడ్‌గా కనిపిస్తా.. ‘‘ కాల్ మీ ఎనీ టైం ’’ అంటూ వలపు వల, రూ. 24 లక్షలు టోకరా

By Siva Kodati  |  First Published Aug 11, 2021, 9:53 PM IST

న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి బాధితుడి దగ్గర రూ. 24 లక్షలు దోచుకున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నుండి ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది    


హానీ ట్రాప్ కేసును ఛేదించారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ మీ ఎనీ టైం అనే అడ్వర్టైజ్‌మెంట్ చూసి మోసపోయాడు విశాఖకు చెందిన బాధితుడు ప్రణీత్. న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి బాధితుడి దగ్గర రూ. 24 లక్షలు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ నుండి ఈ ఘరానా మోసం జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో జ్యోతి అనే మహిళ కూడా వుంది. మొత్తం 24 లక్షల్లో మూడున్నర లక్షల సొత్తును రీకవరీ చేసినట్లు పోలీసులు వివరించారు. అలాగే నిందితుల నుంచి 5 స్మార్ట్ ఫోన్లు, 3 సాధారణ మొబైల్స్, 3 ఏటీఎం కార్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

click me!