కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

Published : Jan 28, 2019, 03:27 PM IST
కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

సారాంశం

కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి  ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కర్నూల్: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి  ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరనుంది.ఫిబ్రవరి మాసంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  కర్నూల్‌లో నిర్వహించే  సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే యూత్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు సమర్పించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రవీంద్ర కూడ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఈ తరుణంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలను తీసుకొంటుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కట్టబెట్టనున్నారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడ సుధీర్ఘ కాలం టీడీపీలో కొనసాగారు. ఏడాదిన్నర క్రితం కూడ టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. టీడీపీలో బైరెడ్డి చేరకుండా  ఓ వర్గం అడ్డుపడిందనే ప్రచారం అప్పట్లో సాగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరలేని పరిస్థితులు నెలకొనడంతో  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.కర్నూల్ కాంగ్రెస్ పార్టీ  జిల్లా అధ్యక్ష బాధ్యతలను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: నాగరాజును కాపాడటానికే ‘సిట్‌’ దర్యాప్తు: అంబటి | Asianet News Telugu
Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu