ఏపీ రాజధాని మార్పు కేసీఆర్ ఎత్తుగడేనా..?: తులసిరెడ్డి ఏమన్నారంటే

By Arun Kumar PFirst Published Aug 6, 2020, 10:53 AM IST
Highlights

ఏపీ రాజధాని మార్పు నిర్ణయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వుందని జరుగుతున్న  ప్రచారంపై కాంగ్రెస్ సీరియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. 

అమరావతి: వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు అంశం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తెరపైకి వచ్చింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రజలు, టిడిపి నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని మార్పు నిర్ణయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ సీరియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను వింటున్నాడని అనుకోవడం లేదన్నారు. రాజధాని విషయంలోనూ కేసీఆర్ సూచనలను జగన్ అమలుచేస్తున్నాడన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదనుకుంటున్నానని పేర్కొన్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లుగా జగన్ వింటే  అంతకంటే దురదృష్టం మరొకటి వుండదని తులసిరెడ్డి అన్నారు. 

రాజధానికి అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించడంతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పాత్ర ప్రదానంగా వున్నట్లు కనిపిస్తోందన్నారు. కానీ రాష్ట్రంలోని నాయకులు,  ప్రజలు రాజధాని మార్పును కోరుకోవడం లేదన్నారు తులసి రెడ్డి. 

READ MORE  జగన్ సర్కార్ మరో పంచాయతీ ఆర్గినెన్సు: చిక్కులు ఇవే...

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

అధికారంలోకి వచ్చి తర్వాత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ  విషయాన్ని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ ప్రకటించారు.ఈ రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఏడాది జూన్ మాసంలో శాసనమండలి వాయిదా పడింది. జూన్ కంటే ముందు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని సూచించింది.

అయితే సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ  టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను  టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది. 

శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. 

click me!