ఏపీ సీఎం జగన్ కి గుడి!

Published : Aug 06, 2020, 09:56 AM ISTUpdated : Aug 06, 2020, 10:16 AM IST
ఏపీ సీఎం జగన్ కి గుడి!

సారాంశం

బలహీనవర్గాల కోరిక మేరకు ఆయన అభిమానిగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగిస్తున్నరని, చరిత్రలో సినిమా నటులకే ఆలయాలు నిర్మించిన సంఘటనలే ఉన్నాయని మొదటిసారిగా ఓ ప్రజా నాయకుడికి గుడి ఏర్పాటు సంకల్పం జగన్ తోనే ఆరంభం అన్నారు.   

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సరిగా ఒక ముఖ్యమంత్రికి గుడి కడుతున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా లో చోటు చేసుకొంది. గోపాలపురం మండలం రాజంపాలెంలో స్థానిక వైఎస్సార్ నాయకులు కురుకూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఆలయ నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు బుధవారం శంఖుస్థాపన చేశారు.

గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు తన స్వంత నిధులతో నిర్మిస్తున్న తొలి రాజకీయ నాయకుడి గుడిగా ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని,జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై,ఆ ప్రజాభాంధవుడిని దైవంగా కొలుస్తున్న బడుగు బలహీనవర్గాల కోరిక మేరకు ఆయన అభిమానిగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగిస్తున్నరని, చరిత్రలో సినిమా నటులకే ఆలయాలు నిర్మించిన సంఘటనలే ఉన్నాయని మొదటిసారిగా ఓ ప్రజా నాయకుడికి గుడి ఏర్పాటు సంకల్పం జగన్ తోనే ఆరంభం అన్నారు. 

పాదయాత్రలో ప్రజల కష్ట నష్టాలను గమనించి వారికి హామీ ఇచ్చిన ప్రకారం నవరత్నాల ద్వారానే కాకుండా ఇతర సంక్షేమ పథకాలను నూరు శాతం అమలుచేస్తూ ప్రజలలో దేవుడిగా జగన్ కీర్తి నొందారని, అటువంటి దేవుడికి ఆలయం నిర్మిస్తున్న నాగేశ్వరరావు దంపతుల సేవా నిరతని ఈ సందర్భంగా కొనియాడారు.అయితే గతంలో పక్కరాష్ట్రం అయిన తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓ వ్యక్తి గుడి కట్టించాడు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu
YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu