ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి .. ఆమెను చూసి జాలి పడుతున్నా : కేవీపీ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 04, 2023, 09:11 PM IST
ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి .. ఆమెను చూసి జాలి పడుతున్నా  : కేవీపీ వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. బీజేపీకి వున్న 0.48 ఓటు శాతం కూడా తగ్గిపోతుందని కేవీపీ జోస్యం చెప్పారు. 

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. పురంధేశ్వరిని చూసి జాలి పడుతున్నానని.. బీజేపీ చేసిన పనులకు ఆమె సమాధానం చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసింది బీజేపీయేనన్నారు. బీజేపీకి వున్న 0.48 ఓటు శాతం కూడా తగ్గిపోతుందని కేవీపీ జోస్యం చెప్పారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఆయనకు నిబద్ధత లేదని, మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఘటనా ఘటనా సమర్ధుడన్నారు. రాహుల్‌తో స్టేజ్ పంచుకుని, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి.. రాహుల్‌ మాటపడ్డప్పుడు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారకపోవచ్చునని.. కానీ సంస్థాగతంగా బలపడతామని కేవీపీ రామచంద్రరావు అన్నారు. 

మరోవైపు దివంగత వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు కేవీపీ. రంగా అంటే వైఎస్సార్‌కు ఎంతో ప్రేమ వుండేదన్నారు. రాజశేఖర్ రెడ్డి అప్పగించిన బాధ్యతలను రంగా నెరవేర్చారని .. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఏర్పడటానికి రంగా కృషి చేశారని కేవీపీ ప్రశంసించారు. 1985లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. అసాంఘిక శక్తుల చేతుల్లో అమరుడయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read: చంద్రబాబు కాదు .. పవనే కీ ఫ్యాక్టర్ : సోము వీర్రాజు పదవి అందుకే ఊడిందా , కమలనాథుల లెక్కేంటీ..?

కాగా.. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మర్పులు చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పోస్టు నుంచి తప్పుకోవాల్సిందిగా పార్టీ అధిష్టానం సూచించిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పదవి రేసులో వై సత్యకుమార్, సుజనా చౌదరి పోటీలో ఉన్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ.. పురందేశ్వరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్