కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపులు: వైసిపికి టచ్ లో సోదరుడు

By Nagaraju TFirst Published Jan 24, 2019, 1:43 PM IST
Highlights

దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. త్వరలోనే సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో సూర్యప్రకాశ్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. 

కర్నూలు: కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అలర్ట్ అయ్యింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం చేజారిపోకుండా ఉండేందుకు రంగంలోకి దిగింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసింది. 

పార్టీ వీడేందుకు గల కారణాలను సూర్యప్రకాశ్ రెడ్డి అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. అయితే సూర్యప్రకాశ్ రెడ్డి నుంచి సమాచారం సేకరించిన హై కమాండ్ పార్టీ వీడొద్దంటూ హితవు పలికింది. పార్టీకి కొంత గడువు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో శుక్రవారం నిర్వహించాలనుకున్న సమావేశాన్ని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. ఇకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. 

దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. త్వరలోనే సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో సూర్యప్రకాశ్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. 

మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు హర్ష మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డ కోట్ల ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందా లేక కొంతకాలం గడువు ఇచ్చి పార్టీ మారుతుందా అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెసుకు షాక్: రాజీనామాకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రెడీ, టీడీపిలోకి జంప్

click me!