కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ దారుణ హత్య

Published : Feb 26, 2019, 01:20 PM IST
కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ దారుణ హత్య

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మహిళా కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మహిళా కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బాత్ రూమ్ వద్ద రక్తపు మడుగులో ఆమె శవమై కనిపించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్ గా పనిచేసిన విజయారెడ్డి.. అక్కయపాలెం ఎన్జీవోస్ కాలనీలోని పద్మభాస్కర అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. కాగా.. ఆమె తాను నివసించే అపార్ట్ మెంట్ ని అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న కొందరు దుండగులు.. అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. ఇంటికి వచ్చి.. ఆమెపై దాడిచేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu