ఏపీలో ఓట్ల గోల్ మాల్... టీడీపీకి సైబర్ షాక్

By ramya NFirst Published Feb 26, 2019, 1:09 PM IST
Highlights

ఏపీలో ఓట్ల గోల్ మాల్ ఆరోపణల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. 

ఏపీలో ఓట్ల గోల్ మాల్ ఆరోపణల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.  ఏపీ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిని వెంటనే సవరించాలని గత కొంతకాలంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై తాజాగా దర్యాప్తు మొదలైంది.

ఏపీలో దాదాపు 3.7కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు, ఎన్నికల కమిషన్, యూఐఏఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

హైదరాబాద్ లోని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డేటా బ్రీచింగ్ కి పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీ తయారు చేసిన సేవా మిత్ర అనే యాప్.. టీడీపీకి మద్దతుగా పనిచేస్తోందని.. ఆ యాప్ సహాయంతోనే.. ఓటర్ల డేటాను దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.

సేవామిత్ర యాప్ లో ఓటర్ల ఐడీ నెంబర్లు, పేర్లు, క్యాస్ట్, కలర్ ఫోటోలు, బూత్ లెవల్ సమాచారం, కుటుంబ వివరాలు, వారు పొందుతున్న ప్రభుత్వ పథఖాలు వంటి అంశాలను సేకరిస్తున్నారని సమాచారం. వాటి ద్వారా తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారనే ఫిర్యాదు కూడా ఉంది. ఈ ఫిర్యాదులను ఆధారం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం గురించి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ... డేటా బ్రీచ్‌కు సంబంధించి ఫిర్యాదు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

click me!