వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీకో రౌడీ: బాబు తీవ్ర వ్యాఖ్యలు

Published : Feb 26, 2019, 01:20 PM IST
వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీకో రౌడీ: బాబు తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మరోసారి నిప్పులు చెరిగారు.


అమరావతి: వైసీపీపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మరోసారి నిప్పులు చెరిగారు.  ప్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ మాత్రం హైద్రాబాద్‌లో ఉందన్నారు. ఈ రెండింటికి వ్యూస్ ఢిల్లీ నుండి అందుతున్నాయని  బాబు ఆరోపించారు.

మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీ గల్లీకి రౌడీలు పుట్టుకొస్తారని చంద్రబాబునాయుడు చెప్పారు.

ఏపీని మరో బీహార్‌ చేసేందుకు  వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. దెందులూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటనలను  చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.

గతంలో హైద్రాబాద్‌లో వీరే  హైద్రాబాద్‌లో మత కల్లోహాలను  సృష్టించారని  ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా కూడ ఓటర్ల జాబితాను తారు మారు చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని బాబు ఆరోపించారు.

ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఎర్ర చందనం ఆదాయం అయిపోయేసరికి వైసీపీ నేతల్లో ప్రస్టేషన్  నెలకొందన్నారు. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna