కాబోయే కేంద్ర మంత్రులకు అభినందనల వెల్లువ

By Galam Venkata RaoFirst Published Jun 9, 2024, 9:22 AM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎంపీలు విజయ కేతనం ఎగురవేశారు. పోటీ చేసిన 25 స్థానాల్లో 21 గెలుచుకున్నారు. ఇందులో 16 చోట్ల విజయభేరి మోగించిన తెలుగుదేశం ఎంపీల్లో ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో చోటు ఖాయమైంది. ఈ సందర్భంగా ప్రముఖులు ఏమన్నారంటే...  

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులుగా ఎంపికైన వార్తల నేపథ్యంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే రామ్మోహన్‌ నాయుడు, చంద్రశేఖర్‌లకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 

ఎంపీలు రామ్మోహన్, చంద్రశేఖర్‌కు మాజీ ఎంపీ గల్ల జయదేవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఎంపికైన రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రిగా ఎంపికైన పెమ్మసాని చంద్రశేఖర్ కొత్త బాధ్యతల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆశిస్తున్నా. ఎంపీగా గెలిచిన తొలిసారే దేశానికి సేవ చేయబోతున్న పెమ్మసానిని చూసి గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వపడుతున్నారు' అని గల్లా జయదేవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Latest Videos

 

 

Congratulations to my young friend on being confirmed as a cabinet minister in the new Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB

— Jay Galla (@JayGalla)

Congratulations to Dr. on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc

— Jay Galla (@JayGalla)


 

రామ్మోహన్‌ నాయుడుకు కలిసొచ్చిన అంశాలు...

కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు. 
కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు. 
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా మంచిపేరుంది. 
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉంది.
రాష్ట్ర సమస్యలపై అనేకమార్లు పార్లమెంటు చర్చల్లో ధాటిగా మాట్లాడారు. 

వ్యక్తిగత జీవితం
స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ
వయసు:  36 ఏళ్లు, విద్యార్హత:  బీటెక్, ఎంబీఏ 
తల్లిదండ్రులు:  ఎర్రన్నాయుడు-విజయలక్ష్మి
భార్య:  శ్రావ్య, కుమార్తె:  నిహిర అన్వి శివాంకృతి
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్‌ నాయుడకు బాబాయి.


తొలి అడుగులోనే లక్కీ ఛాన్స్‌...

పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాపారవేత్త. 
తొలిసారి 2024లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం. 
గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి వైద్యుడిగా అమెరికాకు వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 
యు వరల్డ్‌ పేరుతో ఆమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించారు.
ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ రూ.వేల కోట్ల సంపాదన. 
అంతర్జాతీయ పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో అయనకున్న అనుభవం కలిసొచ్చే అంశం

వ్యక్తిగత జీవితం
పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు ఎంపీ
జన్మస్థలం:  గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం
వయసు:  47సంవత్సరాలు
విద్యార్హత:  ఎంబీబీఎస్, ఎండీ
తల్లిదండ్రులు:  పెమ్మసాని సాంబశివరావు-సువర్చల
భార్య:  డాక్టర్‌ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె 
 

click me!