ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుండి వివాదాస్పద నటి శ్రీరెడ్డి నోటికి పనిచెప్పింది. చివరకు చనిపోయిన రామోజీ రావు గురించి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడింది శ్రీరెడ్డి...
అమరావతి : శ్రీరెడ్డి... వివాదాలకు కేరాఫ్ అడ్రస్. సమయం, సందర్భం ఏదైనా సరే... నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం ఆమె నైజం. ఎవరు ఏమనుకుంటే నాకేంటి... నేను మాట్లాడే ప్రతిదీ వివాదాస్పదం కావాలి... నిత్యం వార్తల్లో వుండాలన్నది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఆమె చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను అమ్మనాబూతులు తిట్టింది. చివరకు తమ నాయకుడని చెప్పే వైఎస్ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిలను కూడా వదిలిపెట్టలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈమె తీరు మరింత దారుణం... వైసిపి ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆమె నోటిదురుసు మరింత పెరిగింది. తాజాగా మీడియా మొగల్, వ్యాపార దిగ్గజం రామోజీరావు మృతిపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తుంటే శ్రీరెడ్డి మాత్రం అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయింది.
గతంలో చంద్రబాబు నాయుుడు తనయుడు నారా లోకేష్ యువగళం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటుడు తారకరత్న మృతిని శ్రీరెడ్డి గుర్తుచేసారు. యువగళంలో తారకరత్న పోయాడు... టిడిపి గెలవగానే రామోజీరావు పోయాడంటూ ఆమె చాలా దారుణంగా మాట్లాడింది. వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించేందుకు టిడిపి నాయకులు క్షుద్రపూజలు చేసారని... పొరపాటున వైఎస్ జగన్ పేరుకు బదులు ఈనాడు గాడి పేరు వాడారంటూ మాట్లాడింది. ఇలా కుల గురువు, రాజకీయ గురువు రామోజీరావును టిడిపి వాళ్లే బలి తీసుకున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
అంతకుముందు ''జగన్ అన్న ఓటమిలో సింహ భాగం వున్న రామోజీ సచ్చాడంట ..అందరూ rip కొట్టి మీ సంతోషాన్ని వెళ్ళగక్కoడి ..బోణి కొట్టాం ..లెగ్ బాబు... లెగ్గు మాములు లెగ్ కాదు'' అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
Rest in peace pic.twitter.com/2t3ChzWCjg
— Sri Reddy (@SriReddyTalks)
రామోజీరావు మృతిపై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులే కాదు సామాన్య నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. శ్రీరెడ్డి బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చావుతో రాజకీయాలు చేయడం మీ అన్న జగన్ దగ్గర నేర్చుకున్నావా అంటూ కొందరు... పెద్దమనిషి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదరి మరికొందరు శ్రీరెడ్డికి సూచిస్తున్నారు.