మైదుకూరు ‘దేశం’లో అయోమయం

Published : Oct 09, 2017, 01:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మైదుకూరు ‘దేశం’లో అయోమయం

సారాంశం

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ను చంద్రబాబునాయుడు టిటిడి బోర్డు ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుండి పోటీ చేయబోయేది డిఎల్లే అన్నది పార్టీలో జరుగుతున్న ప్రచారం.  

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. కొద్ది రోజులుగా నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ను చంద్రబాబునాయుడు టిటిడి బోర్డు ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అదే సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ప్రస్తుత ఇన్చార్జి పుట్టాను టిటిడి ట్రస్ట్ బోర్డుకు ఛైర్మన్ ను చేసి ఆ స్ధానాన్ని డిఎల్ కు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారనేది ప్రచారం. అంటే వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుండి పోటీ చేయబోయేది డిఎల్లే అన్నది పార్టీలో జరుగుతున్న ప్రచారం.

అయితే, తాజాగా మైదుకూరులో ఓ సమావేశం జరిగింది. అందులో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తదితరలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, టిటిడి బోర్డుకు కాబోయే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు శుభాకాంక్షలు చెప్పాలంటూ పిలుపిచ్చారు. అంతేకాకుండా వేదిక మీదనుండే మంత్రి శుభాకాంక్షలు కూడా చెప్పేసారు. అంత వరకూ బాగానే ఉన్నారు.

అయితే, తర్వాత  సిఎం రమేష్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కూడా పుట్టానే మైదుకూరులో పోటీ చేస్తారంటూ ప్రకటించారు. దాంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇతర పార్టీల నుండి ఎవరో వచ్చి చేరుతారని, వాళ్ళే పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టంగా చెప్పారు. అంటే డిఎల్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం తప్పా? లేక డిఎల్ పార్టీలో చేరినా పోటీ మాత్రం పుట్టానే చేస్తారా అన్న విషయంలో నేతల మధ్య అయోమయం మొదలైంది.

ఒకవేళ డిఎల్ టిడిపిలో చేరటమూ నిజమే, వచ్చే ఎన్నికల్లో పుట్టానే మళ్ళీ పోటీ చేయటమూ నిజమే అని అనుకుందాం. మరి ఏం ఆశించి ఎన్నికలకు ముందు డిఎల్ టిడిపిలో  చేరుతున్నట్లు ? ఈ సందేహాలతోనే టిడిపి నేతల్లో అయోమయం మొదలైంది. ఇటు డిఎల్ కానీ అటు చంద్రబాబునాయుడో క్లారిటీ ఇస్తే తప్ప నేతల్లోని అయోమయం తీరేట్లు కనబడటం లేదు.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu