ఒత్తిడిలో వైసీపీ అధినేత

First Published Oct 9, 2017, 12:05 PM IST
Highlights
  • వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి మొదలైంది.
  • రెండు మూడు అంశాలకు సంబంధించి జగన్ లో టెన్షన్ పెరిగిపోతోంది.
  • పాదయాత్ర విషయంలో కోర్టు అనుమతులు ఇచ్చే విషయం ప్రధానమైంది.
  • మిగిలిన అంశాలేంటంటే, పలువురు నేతలు పార్టీని వీడిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారం, నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగలేమని కొందరు నేతలు జగన్ కు లేఖలు రాస్తుండటం.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి మొదలైంది. రెండు మూడు అంశాలకు సంబంధించి జగన్ లో టెన్షన్ పెరిగిపోతోంది. పాదయాత్ర విషయంలో కోర్టు అనుమతులు ఇచ్చే విషయం ప్రధానమైంది. మిగిలిన అంశాలేంటంటే, పలువురు నేతలు పార్టీని వీడిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారం, నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగలేమని కొందరు నేతలు జగన్ కు లేఖలు రాస్తుండటం.

అక్రమాస్తుల కేసుల విచారణలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కోర్టులో విచారణ అంశాన్ని సీరియస్ గా తీసుకోకుండా జగన్ ఆరుమాసాల పాదయాత్రను ప్రకటించారు. అదే ఇపుడు పెద్ద సమస్యగా మారింది. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వటమంటే జగన్ కు ఇబ్బందే. అందుకే వ్యక్తిగత మినహాయింపును కోరారు. అయితే, జగన్ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. అయితే, మళ్ళీ ఇంకో పిటీషన్ వేసారు. దానిపై 13న విచారణ జరగాల్సి ఉంది. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలోనే జగన్ లో టెన్షన్ మొదైలంది.

ఇక, మిగిలిన రెండు అంశాలు పార్టీకి సంబంధించినవనుకోండి. పార్టీని వీడిపోతారంటూ కొందరు నేతలపై ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మొన్ననే కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో జగన్ చెప్పాల్సిందంతా చెప్పారనుకోండి అది వేరే సంగతి. అయితే, టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తోంది. దాన్ని తట్టుకుని నిలవటం చాలామంది వైసీపీ నేతలకు కష్టంగా ఉంది. మరి, కర్నూలు నేతలేం చేస్తారో చూడాలి.

అదే విధంగా విజయనగరం ఇన్చార్జి బాధ్యతలను నుండి తనను తప్పించమంటూ కోలగట్ల వీరభద్రస్వామి జగన్ కు లేఖ రాసారు.  కోలగట్ల మార్గంలోనే మరింకొందరున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి కారణాలతో జగన్ లో టెన్షన్ పెరిగిపోతోంది. పాదయాత్ర విషయంలో కోర్టు స్పందించే తీరునుబట్టి జగన్  భవిష్యత్
ఆధారపడి ఉంటుంది.

click me!